చెన్నై జైలుకి వద్దు...

 


అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో భాగంగా ఆమె బెంగుళూరు లోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెను చెన్నైలోని జైలుకి మార్చాలని చూస్తున్న నేపథ్యంలో.. ఈనిర్ణయాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా పెరోల్ మీద శశికళ జైలునుండి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే జైలులో ఆమెకు మెరుగైన సేవలందించేందుకు తమిళనాడులోని జైలుకు తరలించాలని పళనిస్వామిని ఆదేశించాలని ఆమె న్యాయవాదులు ఆమెకు సూచించినట్టు సమాచారం. కానీ శశికళ మాత్రం దానిని తోసిపుచ్చారని తెలుస్తోంది. పరప్పన అగ్రహార జైలులో సమస్యలు లేవని, తమిళనాడు జైలులో ఉంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu