సండ్ర బెయిల్ పిటిషన్ పై మళ్లీ వాయిదా

 

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సండ్ర బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరగా విచారణను సోమవారాని వాయిదా వేశారు. మరోవైపు ఈరోజు సండ్రను విచారణ నిమిత్తం ఏసీబీ కార్యలయానికి తరలించారు. రెండు రోజులపాటు అంటే గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు.. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ఏసీబీ అధికారులు సండ్రను విచారణ చేయనున్నారు.