సాయికాళేశ్వర్ ఆస్తులపై త్వరలో విచారణ
posted on Apr 5, 2012 7:54AM
పెనుగొండ సాయికాళేశ్వర్ కూడబెట్టిన ఆస్తులపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయికాళేశ్వర్ ఆస్తులపై ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. దీనికితోడు ఆయన గతంలో ప్రాచీన కోటల్లో తవ్వకాలు జరిపి విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు దాచిపెట్టిన సుమారు రూ. 300 కోట్ల విలువైన నిధులను సొంతం చేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి జి.నాగిరెడ్డి ఇదే విషయమై స్వయంగా కలెక్టర్ ను కలుసుకుని ఫిర్యాదులు కూడా చేశారు. ఆశ్రమంలో సోదాలు జరపాలని, ఆశ్రమ నిర్వాహకులను విచారించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. విజయనగర సామ్రాజ్యం నాటి నిధులు ప్రస్తుత ట్రస్ట్ నిర్వాహకుల స్వాదీనంలోనే ఉన్నాయని, ఇవి తరలిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ ను కోరారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణ జరపవలసిందిగా పెనుగొండ డి ఆర్ ఓ ఈశ్వర్ ను ఆదేశించారు.