హెయిర్ స్టైల్ నచ్చలేదని...
posted on Dec 18, 2015 12:10AM

తన కొడుకు హెయిర్ స్టైల్ నచ్చలేదని ఓ తండ్రి కుటుంబం మొత్తాన్నీ నరికి చంపిన ఘోరమైన ఘటన రష్యాలో జరిగింది. ఓలెక్ బెలోవ్ అనే వ్యక్తి భార్య, ఆరుగురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఓలెక్ భార్య తన ఆరేళ్ళ కొడుక్కి వెరైటీ స్టైల్లో హెయిర్ కట్ చేయించింది. ఆ స్టైల్ ఓలెక్‌కి నచ్చలేదు. దాంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ ముదిరి ఆమె విడాకులు ఇస్తానని అనేవరకూ వెళ్ళింది. దాంతో అతని ఆగ్రహం కట్టలు తెచ్చుకుని తన భార్యని, ఆరుగురు పిల్లల్ని దారుణంగా నరికి చంపాడు. చనిపోయే సమయంలో అతని భార్య ఆరు నెలల గర్భవతి. భార్యను, పిల్లలను నరికి చంపిన తర్వాత ఓలెక్ కత్తి చేత పుచ్చుకునే తన తల్లిదగ్గరకి వెళ్ళి ఆమెను కూడా నరికి చంపాడు. శవాలన్నిటినీ ప్లాస్టిక్ సంచుల్లో కుక్కేశాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి లొంగిపోయాడు.