రుద్రమదేవితో రానా సయ్యాటలు

 

అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం "రుద్రమదేవి". గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఆదిలాబాద్ లోని కుంటాల వాటర్ ఫాల్స్ దగ్గర రానా,అనుష్కలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు రెస్పాన్స్ అధికంగా రావడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.