ఆయన రామ్...నేను హనుమాన్...!

 

అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ కలిసి నటించిన తమిళ చిత్రం "ఆరంభం". ఇటీవలే విడుదలై రికార్డులను తిరగరాస్తూ, కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో "ఆట ఆరంభం" పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ పాటల విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. రానా తన పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పడం పూర్తయ్యింది. ఈ సినిమా గురించి రానా మాట్లాడుతూ... ఈ సినిమా ఒక రామాయణం లాంటిది. ఇందులో రాముడైతే, ఆర్య లక్ష్మణుడు, నేను హనుమంతుడిలాంటివాడిని. ఎందుకంటే అజిత్ లాంటి మంచి వ్యక్తిని నేను ఇప్పటివరకు కలవలేదు. అందుకే ఆయనను రాముడితో పోల్చాను అని అన్నారు.