జెసి దివాకర్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆర్టీఏ అధికారులు...

 

మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాకిచ్చారు. ఆర్టీఏ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఇరవై మూడు బస్సులను సీజ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం. ఇష్టానుసారంగా టిక్కెట్ల రేట్లు పెంచడం వంటి ఆరోపణలు వచ్చాయని అవి నిజమేనని తేలడంతో సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి జరిగిన ఆర్టీఏ అధికారుల తనిఖీలో భాగంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ కు సంబంధించిన 23 బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ కూడా పర్మిషన్లు ఒక రూట్లో ఉంటే మరొక రూట్లో నడుపుతున్నారు అనే నేపధ్యంతో అలాగే కొన్ని బస్సులకు పర్మీషన్ ల్ కూడా లేవు అనే నేపధ్యంలో 23 బస్సులను సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా 8 బస్సులు అనంతపురంలో నాలుగు బస్సులు అలాగే గుంతకల్లులో మూడు బస్సులు పెనుకొండలో ఒక బస్సు రాత్రి ఆర్టీఏ అధికారులు సీజ్ చేసారు.

కానీ జేసీ వాళ్ళతో మాట్లాడితే మాత్రం మేము 2003 నుంచి కూడా బస్సు సర్వీసులు నడుపుతున్నామని తమకు అన్ని పర్మీషన్ లు కూడా ఉన్నాయని వాళ్ళు వెల్లడించారు.తమ ప్రైవేట్ బస్సులను సీజ్ చేయ్యడం తగదని ఆయన ఆర్టీఏ అధికారులకు వెల్లడించారు.తన బస్సులు ఏ రూటు వెల్లాల్లో వాటిని పర్మీషన్ ఉన్న ప్రాంతాలల్లొనే నడుపుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.వారికి ట్రాఫిక్ నిబందనలు అన్ని తెలుసని వాటి ప్రకారమే బస్సులను నడుపుతున్నామని జేసీ వెల్లడించారు.కానీ ఆర్టీఏ వాదనలు మాత్రం ఇందుకు విరుద్ధింగా ఉన్నాయి,కావునే తాము సీజ్ చేసే పరిస్థితి నెలకొంది అని ఆర్టీఏ అధికారులు సమాధానమిచ్చారు.ఇక ఈ చర్చ దేనికి దారి తీయ్యనుందో వేచి చూడాలి.