రోజుకో పార్టీతో రోజా సినీ వేషాలు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పై, చంద్రబాబుపై విమర్శలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు ఎన్.లక్ష్మీపార్వతిపై తెలుగు మహిళా విభాగం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి, ఎమ్మెల్యే సీతక్క, లలిత మాట్లాడారు. రోజుకో పార్టీ మారుస్తున్న రోజా, రాజకీయాల్లోనూ సినీ ఫక్కీలో వేషాలు వేస్తోందన్నారు. టీడీపీలో ఉన్న సమయంలో వైఎస్‌పై దుమ్మెత్తిపోసి, నేడు జగన్ పార్టీలో చేరి టీడీపీని విమర్శిస్తావా? అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌కు కొంతకాలం భార్యగా ఉన్నందునే ఇంతకాలం లక్ష్మీపార్వతిని విమర్శించలేదని వారు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu