రేవంత్ వల్లే దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్!

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా?  ఆ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ రెడ్డే కారణమా అంటే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఔననే అంటున్నారు. ఎంతో ముందుగా ఫిక్స్ అయిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి అదే రోజు మాదాపూర్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడంతో దేవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారని అంటున్నారు. స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కు స్ట్రాంగ్ అభిమానుల బేస్ ఉంది. కొన్నేళ్ల తరువాత  ఎన్టీఆర్ సినీమా విడుదల కాబోతుండటంతో ఫ్యాన్స్ అవధులు లేని ఆనందంలో ఉన్నారు.

వాస్తవానికి 2018 తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న సినిమా దేవర. మధ్యలో ఆర్ఆర్ఆర్ రిలీజై రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ పాన్ వరల్డ్ హీరో అయిపోయారు. అయినా కూడా ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించారు. దీంతో ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తరువాత వస్తున్న సినిమా దేవర. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా క్రేజ్ అంబరాన్నంటింది. అందుకే దేరవ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేశారు. అవసరమైన అనుమతులన్నీ తీసుకున్నారు. పోలీసులు కూడా ఫంక్షన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ అంటే తోపులాట, తొక్కిస లాట వంటివి జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. నోవాటెల్ లో జరగాల్సిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు అందనంత సంఖ్యలో భారీగా రావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో చివరి క్షణంలో దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ ను రద్దు చేశారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు తరువాత అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. మొత్తం మీద అంచనాలకు మించి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో పాటు సీఎం రేవంత్ కార్యక్రమం కూడా దేవర ప్రీరిజ్ ఈవెంట్ రద్దుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. 

ఎందుకంటే పోలీసు బందోబస్తు రేవంత్ కార్యక్రమం కోసం వెళ్లడంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన నోవాటెల్ వద్ద సరిపడినంత బందోబస్తు లేకుండా పోయింది. సీఎం కార్యక్రమం ముగిసి పోలీసు బలగాలు నోవాటెల్ ప్రాంతానికి రాత్రి ఎనిమిదిన్నగంటల తరువాత వచ్చారు. అయితే అప్పటికే పోలీసులు కంట్రోల్ చేయలేనంతగా ఎన్టీఆర్ అభిమానులు నోవాటెల్ వద్దకు చేరుకున్నారు. చివరి క్షణంలో అంత క్రౌడ్ కంట్రోల్ చేయడం సాధ్యం కాదని భావించిన నిర్వాహకులు ఫంక్షన్ క్యాన్సిల్ చేయడం వినా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చి ఫంక్షన్ రద్దైందని ప్రకటించారు.  అంచనాలకు మించి అభిమానులు తరలిరావడం వల్లే ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యిందని నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నా.. సీఎం రేవంత్ పాల్గొన్న కార్యక్రమ బందోబస్తు కోసం దేవర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను బలి చేశారని అభిమానులు వాపోతున్నారు.   నిజానికి సీఎం ప్రోగ్రాం, దేవర ఫంక్షన్ రెండూ  దాదాపు  ఒకే టైమ్‌లో,  ఒకే ఏరియాలో జరగడమే అసలు సమస్య అని అభిమానులు అంటున్నారు.