రేవంత్ రెడ్డి కుమార్తె వివాహం.. టీఆర్ఎస్ నేతలు ఎక్కడ?

టీడీపీ నేత రేవంత్ రెడ్డి కుమార్తె నైమిష రెడ్డి వివాహం నిన్న అంగరంగవైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి ఎంతోమంది రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇంత మంది ప్రముఖులు హాజరైన టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఒక్కరు కూడా ఈ పెళ్లి వేడుకలో కనిపించలేదు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివాహ పత్రిక అందిచాలని.. తన కూతురు వివాహానికి కేసీఆర్ కుటుంబాన్ని ఆహ్వానించాలని అనుకుంటున్నట్టు వార్తలు కూడా జోరుగానే వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి ఎటువంటి ఆహ్వానం అందించలేదు. అంతేకాదు దీనికి ఓటు నోటు కేసు కూడా ఒక కారణం కావచ్చు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేత అయిన జగన్ ను కూడా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను ఆహ్వానించకపోవడంతో ఇదే కారణమై ఉండచ్చు అని అనుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ పెళ్లి పిలుపుల్లో విభజన స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.