రేవంత్ రెడ్డి క్లాస్

 

తెలంగాణా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన "నేను చెప్పేది నేను చెబుతా... నువ్వుండయ్యా" అని ఓ మీడియా ప్రతినిధితో వాగ్వాదానికి దిగారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ముందు ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాతే మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయాలని, అలాకాకుండా మమ్మల్ని నిలదీయటం సరికాదని అన్నారు. మీతో మాకు వైరుద్యం లేదు, అంతర్యుద్ధం లేదు. ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మీ వృత్తి మీరు చేయండి. మా వృత్తి మమ్మల్ని గౌరవప్రదంగా చేయనివ్వండి' అని మీడియా ప్రతినిధులతో చెప్పారు. రేవంత్ రెడ్డి తన వాక్ చాతుర్యాన్ని మరొకసారి నిరూపించుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu