శాసనసభలో కోతులు నక్కలు...
posted on Mar 9, 2015 10:51AM
.jpg)
ఇంతవరకు పార్లమెంటరీ బాషలో ఒకరినొకరు చాలా మర్యాదగా తిట్టుకొనే మన ప్రజాప్రతినిధులు అది అంత సౌకర్యంగా లేదని భావించారో లేకపోతే తమ మనసులో మాటని ఎదుతవాడికి సరిగ్గా చెప్పలేక పోతున్నామనుకోన్నారో తెలియదు కానీ క్రమంగా కుక్కలు, నక్కలు, కోతులు రాబందులు అని సంభోదించుకొనే స్థాయికి దిగిపోయారు. తెలంగాణా శాసనసభ సమావేశాలలో సభా కార్యక్రమాలకి అడ్డు తగులుతున్న తెదేపా నేతలను కల్లు తాగిన కోతులని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అందుకు ధీటుగా స్పందిస్తూ కడియం శ్రీహరిలాగ మంత్రి పదవి కోసం ఆరాటపడే గోతికాడ నక్కలం మాత్రం కాదని జవాబిచ్చారు. అసలు కడియం ఎస్టీయే కాదని ఆయన కుల నిర్ధారణ చేసేందుకు ఒక కమిటీ వేయాలని వారు డిమాండ్ చేసారు.