నియోజకవర్గాల పునర్విభజన 2026లోనే.. జమిలి దిశగా తొలి అడుగు!?

దేశంలో జమిలి ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలన్నీ ఇప్పటి నుంచే జమిలికి రెడీ అయిపోయాయి. ఆ దిశగా తమతమ పార్టీల క్యాడర్ ను ప్రిపేర్ చేస్తున్నాయి.  సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరిపి మరీ జమిలి నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి ఇటీవల విస్పష్టంగా చెప్పేశారు. ఆ విషయంలో శషబిషలకు తావులేదని తేల్చేశారు.  షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2029లో జరగాలి. అయితే అంత కంటే రెండేళ్లు ముందుగానే అంటే 2027 జమిలికి కేంద్రం ముహూర్తం పెట్టేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జమిలికి ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న కృత నిశ్చయంతో కేంద్రం ఉండటంతో 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృ త్వంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికే తేన నివేదికను సమర్పించింది. దీంతో జమిలి దిశగా కేంద్రం వేగం పెంచింది. వచ్చే శీతాకాల సమావేశాలలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఆ బిల్లుల ఆమోదంతో పాటే జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణలు కూడా చేసేయాలని భావిస్తోంది.  కమిటీ ఓ నివేదికను సమర్పించింది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశా ల్లో జమిలికి సంబంధించిన బిల్లులను ఆమోదించేలా కేంద్రం కార్యారణ రెడీ చేస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ సహా మరికొన్ని విపక్ష పార్టీలు జమిలిని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజస్వామ్యానికి జమిలి గొడ్డలిపెట్టు అని వాదిస్తున్నాయి. జమిలిని గట్టిగా వ్యతిరేకిస్తామని కుండబద్దలు కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జమిలితో మోడీ సర్కార్ ఎలా ముందుకు సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.