బెటాలియన్ కానిస్టేబుళ్ళు ఆందోళన చేస్తే చర్య తప్పదు: డిజిపి  జితేందర్ 

రాష్ట్రంలో బెటాలియన్‌ కానిస్టేబుళ్ల ఆందోళన చర్చనీయాంమైంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మాదిరిగా  ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు. పోలీసు అధికారుల ఇళ్లల్లో వెట్టి చాకిరి  కోపం బెటాలియన్ కానిస్టేబుల్స్ ఉపయోగపడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ  ఆందోళనపై డీజీపీ జితేందర్‌ తీవ్రంగా స్పందించారు. ఆందోళనల వెనుక కాంగ్రెస్  ప్రభుత్వ వ్యతిరేక శక్తులున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల సెలవులపై పాత పద్ధతినే అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ రిక్రూట్‌మెంట్‌ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీజీపీ ఘాటుగా హెచ్చరించారు.
బెటాలియన్  కానిస్టేబుళ్ళ కుటుంబాల ఆందోళన వెనక రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక శక్తులున్నాని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.