రవితేజ తమ్ముళ్ళు మారరా!

 

 

 

రవితేజ తమ్ముళ్ళు ఇప్పటికే మద్యం తాగి, యాక్సిడెంట్లు చేసి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని అతని పరువు తీశారు. తాజాగా రవితేజ రెండో తమ్ముడు భరత్ మద్యం మత్తులో వీరంగం సృష్టించడంతో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటాక భరత్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. భరత్‌పై ఐపీసీ 186,290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం మియాపూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. భరత్ మద్యం తాగి వాహనం నడపడమే కాక.. అడ్డుకున్న పోలీసుల్ని నానా మాటలన్నాడని అంటున్నారు. వారిపై దాడికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం అతణ్ని బెయిల్ మీద బయటకు తీసుకువచ్చారు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu