న్యూజిలాండ్ కు రభస సయ్యాట

 

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "రభస" చిత్ర యూనిట్ మార్చి రెండవ వారంలో న్యూజిలాండ్ కు వెళ్లనున్నారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి "కందిరీగ" ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తారక్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిందని, కేవలం ఓ పాట షూటింగ్ మాత్రమే మిగిలిందని తెలిసింది. తమన్ అందించిన పాటలు త్వరలో విడుదల కానున్నాయి. యూత్ ఫుల్, కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu