'లెజెండ్' అంచనాలను అందుకుంటాడా?

 

 

 

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'లెజెండ్'. ఈ సినిమా మొదటి టీజర్ ను బుధవారం విడుదల చేశారు. బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్ కు దేవి శ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జతకావడంతో ఈ టీజర్ సినిమాపై అంచనాలు ఇంకా పెంచుతుంది. ఒక పక్క ఒక్కొక్కటిగా లెజెండ్ చిత్ర విషయాలు విడుదలవుతుంటే, మరో పక్క అభిమానులు ఆనందాల కోలాహాలంలో మునిగి తేలుతున్నారు. ఇక నిన్న విడుదలైన 27 సెకండ్ల టీజర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచే విధంగా ఉండడంతో నందమూరి అభిమానులు ఈ చిత్రం విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 'సింహా' తరువాత బోయపాటి, బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరీ బాలయ్య వారి అంచనాలను అందుకుంటాడో లేదో వేచి చూడాలి!

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu