బాహుబలి బలంగా ఉన్నాడు...!
posted on Nov 30, 2013 9:13AM
ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ఈ చిత్ర షూటింగ్ లో ప్రభాస్ కు తీవ్ర గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు విని తన అభిమానులు ఆందోళన చెందుతున్నారని ప్రభాస్ తన ఆరోగ్య పరిస్తితి గురించి అభిమానులకు ఫేస్ బుక్ ద్వారా తెలియజేసాడు. ఫేస్ బుక్ ద్వారా ప్రభాస్ " నాకెలాంటి ప్రమాదం జరగలేదు. నాకు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మీరు ఎలాంటి ఆందోళన చెందకండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు దెబ్బలు తగిలాయని తెలిసి నా అభిమానులు కంగారు పడుతున్నారు. అంతటి ప్రేమ చూపుతున్న అభిమానులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రస్తుతం "బాహుబలి" షూటింగ్ కేరళలో చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు మీ ముందుకొస్తానా అని చాలా ఎదురుచూస్తున్నాను" అని తెలియజేసారు.