దేవుడా.. రజనీ పై ఇలాంటి కామెంట్లా..!

 

రజనీ కాంత్ ఎప్పుడైతే రాజకీయ ప్రవేశంపై మాట్లాడారో అప్పటి నుండి ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒకపక్క ఆయన అభిమానులు రజనీ కాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారని చూస్తుంటే.. మరోపక్క ఆయనపై మాత్రం విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అసలు తమిళనాడులో ఆయనను దేవుడిగా కొలుస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ విచిత్రంగా ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వచ్చాయో అప్పుడే అసలు వ్యతిరేకత ఎదురైంది.

 

మొన్నటికి మొన్న కమల్ హాసన్ రజనీపై కామెంట్లు విసరగా... ఇప్పుడు ప్రముఖ దర్శకుడు భారతీరాజా తాజాగా చేసిన విమర్శలు తమిళనాట పెను కలకలం రేపుతున్నాయి. చెన్నై ప్రెస్ క్లబ్ లో కోలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్లు ఏర్పటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మే 17న మెరీనా బీచ్‌ లో ఈలం వార్ బాధితులకు నివాళిగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభను భగ్నం చేసి, ఆ ఉద్యమానికి ఆద్యుడైన తిరుమురుగన్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. తమపై ఎవరెవరో పెత్తనం చలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు రజనీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించి పరోక్షంగా ఆయనపై కామెంట్లు విసిరారు. తమిళులకు మంచి నేతలు లేరని వారంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారొచ్చి తమని ఏలాలని చూస్తున్నారని మండిపడ్డారు. 'సరే వారన్నట్టే తమిళులకు మంచి నేతలే లేరనుకుందాం. అలాంటప్పుడు వీరొచ్చి మాత్రం ఏం చేస్తారు?' అని ప్రశ్నించారు. అంతే కాకుండా... వారు అలా అనడం ఎలా ఉందంటే... భార్య గర్భవతి కాలేదని బాధపడుతున్న వాడితో నీ బిడ్డకు తండ్రిగా ఉంటానని అడుగుతున్నట్టు ఉందని' ఆయన మండిపడ్డారు. దీంతో భారతీరాజా చేసిన సంచలన వ్యాఖ్యలపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా... కొంతమంది మాత్రం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu