రాజేంద్రుడికి గుండెపోటు!

Rajendraprasad, comedy hero, heart attack, angioplasty, care hospital, Hyderabad, carecter artist, excersize, ayyappa, mala,హీరో రాజేంద్రప్రసాద్ శనివారం రాత్రి గుండెపోటుతో కేర్ ఆసుపత్రిలో చేరారు. ఇబ్బందిని గుర్తించి సరైన సమయానికి చికిత్సనందించిన డాక్టర్లు రాజేంద్రుడికి యాంజియోప్లాస్టీ చేసారు. దీక్షకోసం.. ఆయన కొంతకాలంగా ఎక్కువగా ఎక్సర్ సైజులు చేయడంవల్ల ఒత్తిడి ఎక్కువై గుండెపోటు వచ్చుంటుందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి. కామెడీ క్యారెక్టర్లతోపాటు వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన రాజేంద్రప్రసాద్ కి దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు. అందరినీ కడుపుబ్బనవ్వించి తన హాస్వనటనద్వారా ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందించిన రాజేంద్రప్రసాద్ కి గుండెనొప్పి అన్న వార్త వినగానే అభిమానుల గుండెలు కలుక్కుమన్నాయ్. చివరికి రాజేంద్రుడి ఆరోగ్యం బాగానే ఉందన్న విషయం తెలుసుకుని అభిమానుల మనసు కుదుటపడింది.