రాణి ఎలిజబెత్ ను కాల్చబోయిన గార్డ్....
posted on Jan 5, 2017 3:41PM

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కే తుపాకీ గురిపెట్టి కాల్చబోయాడు ఆమె గార్డ్. మరి అంతటి దుస్సాహసానికి పాల్పడిన గార్డ్ ని బ్రతికి ఉంచారా అంటే ఉంచారు. ఇంతకీ ఆ గార్డ్ ఎవరు.. ఆ కథ ఏంటో ఓ సారి చూద్దాం. రాణి ఎలిజబెత్ ఓ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక తన భవనంలో వాకింగ్‌కి వెళ్లారట. చాలా సేపు వాకింగ్ చేసిన ఆమె దాదాపు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరిగి రాజ భవనంలోకి ప్రవేశిస్తుండగా.. ఇంతలో అక్కడ ఉన్న గార్డ్ ఎవరో అగంతకులు భవనంలోకి ప్రవేశిస్తున్నారు అనుకొని ఎవరది అని గట్టిగా ప్రశ్నిస్తూ తుపాకీ గురిపెట్టాడట. అయితే అక్కడ ఉన్నది రాణి గారు అని తెలుసుకొని షాకయ్యి.. ‘మీరా.. థాంక్ గాడ్. ఎవరో అనుకుని కాల్చబోయాను’ కాస్త గట్టిగా.. కోపంగానే అన్నాడట. అయితే దానికి రాణి గారు మాత్రం చిన్న చిరునవ్వు నవ్వి... ‘నాకు నిద్రపట్టకపోతే అలా నడవడం అలవాటు. ఏం పర్వాలేదు. నువ్వు మరోసారి ఇలా పొరపాటు పడకుండా వాకింగ్‌కి వెళ్లే ముందు నీకు చెప్పే వెళ్తాలే’ అని సమాధానమిచ్చారట. అయితే ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదులెండి. ఈ విషయం ఆ గార్డ్ స్వయంగా చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.