ధోని రాజీనామాపై నెటిజన్ల స్పందన...

 

ఏ విషయమైనా సోషల్ మీడియాలో రావడానికి క్షణాల్లో పని. వచ్చిన విషయాన్ని చూసి వదిలేయకుండా దానిపై కామెంట్లు చేయండంలో కూడా మన నెటిజన్లు మంచి పండితులు. ఈరోజు నెటిజన్లకు దొరికిన న్యూస్ ఏంటంటే...టీ మిండియా కూల్ కెప్టెన్ ధోని రాజీనామా ప్రకటన. టీ20 వన్డే కెప్టెన్సీ నుండి ధోని తప్పుకుంటున్నట్టు తన రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు ఏ రకంగా కామెంట్లు విసిరారో చూద్దాం.

 * కెప్టెన్‌ గా ధోని రిటైరయ్యాడు. దేశంలో డీమానిటైజేషన్‌ తర్వాత ‘డీమహిటైజేషన్’‌ మొదలైంది.

* ఇదే తమిళనాడులో అయితే కోహ్లితో సహా టీమిండియా ఆటగాళ్లు అందరూ ధోని భార్య సాక్షిని కెప్టెన్‌ పగ్గాలు చేపట్టమని బతిమాలేవారు.

* జట్టు ప్రయోజనాల కోసం ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు. పార్టీ కోసం ములాయం సింగ్‌ యాదవ్‌ తప్పు కోవడం లేదు!

* ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇదే సమయంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతోంది. కోహ్లి కెప్టెన్సీలో ఆడాలన్న సంగతి మర్చిపోండి. అతడికి ధోని బిగ్‌ బాస్‌ కావొచ్చు!

* కెప్టెన్సీ నుంచి ధోని నిర్ణయించుకున్నాడు. రోహిత్‌ శర్మ కూడా తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu