సినీ నటి హేమను వేధించి దొరికిపోయాడు

 

actress Hema harassed by youth, actress Hema harassed, Hema SMS Stalker Arrested

 

 

సూర్యాపేటకు చెందిన పాతికేళ్ళ కుర్రోడు సినీ నటి హేమ పై మనసు పరేసుకున్నాడు. అంతే కదా..ఈ కాలంలో ఎంతో మంది సినీ నటిలపై మనసుపడడం లేదు అని అనుకుంటున్నారా, కాని మనోడు అంతటితో ఆగకుండా హేమ ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని అసభ్యకరమైన మెసేజ్‌లతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయమై హేమ, మాధాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు పక్కా వ్యూహంతో అతన్ని పట్టుకున్నారు. పిల్లాడికి కౌన్సిలింగ్ ఇస్తే చాలని పోలీసులు అనుకుంటున్న సమయంలో… మనోడి హిస్టరీ బయటపడింది. ఇదివరకు కూడా మధు ఫోన్‌ ద్వారా ఇతరుల్ని వేధించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో సైబర్‌ క్రైమ్‌ యాక్ట్‌ని బట్టి అతనిపై కేసులు నమోదు చేస్తారట.