అల్లు అర్జున్ బెయిలు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయనున్న పోలీసులు?!

అల్లు అర్జున్ బెయిలు పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం (డిసెంబర్ 30) విచారించనుంది. కాగా అల్లు అర్జున్ కు బెయిలు నిరాకరించాలని కోరుతూ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. గత విచారణ సందర్భంగానే కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కోరడంతోనే నాంపల్లి కోర్టు విచారణను మంగళవారానికి (డిసెంబర్ 30) వాయిదా వేసింది. పుష్ప2 సినిమా బెనిఫిట్ ఫో సందర్భంగా  సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ను పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ కు ఆదేశిందించి. అయితే అల్లు అర్జున్ హైకోర్టులో దాఖలు చేసుకున్న క్వాషష్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిలు పిటిషన్ విచారణ జరుగుతోంది. పోలీసులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేసిన తరువాత అల్లు అర్జున్ బెయిలు పిటిషన్ పై విచారణ జనవరి 10 జరగనుంది.