ఒకే దేశం ఒకే ఎన్నికపై జెపిసి మొదటి సమావేశం మరికొద్దిసేపట్లో...

డిసెంబర్ 17న “ఒకే దేశం ఒకే ఎన్నిక” చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన జెపిసిలో 39 సభ్యులు ఉన్నారు. వీరిలో 27 మంది లోక్ సభ నుండి, 12 మంది రాజ్యసభ నుండి ఉన్నారు. మొదటి వారం చివరి రోజున జెపిసి నివేదికను లోకసభ సమర్పించాల్సి ఉంటుంది.  పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్బంగా సవరణ బిల్లు ను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును  ప్రవేశ పెట్టారు.