పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ కార్యాలయం రాజమండ్రికి తరలించాలి.
posted on Dec 5, 2015 1:18PM
(1).jpg)
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ముంపు ప్రాంతాలను తెలంగాణా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిపారు.అయితే,ప్రాజెక్ట్ నిర్మాణన్ని పర్వవేక్షించే కార్యాలయం మాత్రం హైదరాబాదు నుంచి రాజమండ్రికి తరలించాల్సిన అవసరాన్ని మాత్రం మరచారు.అసలు కార్యాలయం హైదరాబాదులో ఏర్పాటు చేయటమే పెద్ద తప్పిదం!ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రం చేపట్టినా రాష్ట్రం చేపట్టినా పర్యవేక్షణ జరగవలసింది ప్రాజెక్ట్ నిర్మాణ స్థలానికి దగ్గరలో ఉంటేనే నిర్మాణం వేగవంతం అవుతుంది.రాష్ట్ర,కేంద్ర పాలకులు ఈ దిశగా ఆలోచించి వెంటనే ప్రాజెక్ట్ అధారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలి.అప్పుడే ప్రాజెక్ట్ నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి కాగలదు.
గరిమెళ్ళ రామకృష్ణ