పోలవరానికి నిధులు కావాలని జగన్ కోరితే.. ఆలోచించి చెప్తామన్న కేంద్రం

 

పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పై ఏపీ ప్రభుత్వంలో అలజడిరేగుతుంది. ప్రాజెక్టు పన్నుల చెల్లింపులో అక్రమాలు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత సర్కారు పై పడింది. అప్పుడే భవిష్యత్తులో నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ తేల్చి చెప్పింది.పోలవరం ప్రాజెక్టు తీరుపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఏపీ ప్రభుత్వ అధికారులు.

ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.   జల వనరుల శాఖ ఉన్నతాధికారులు రాజధాని నగరంలో అందుబాటులో లేక పోవడంతో వారితో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. వచ్చిన కథనాలు నిజమేనని ఆ శాఖ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా సత్వరమే నిధులు మంజూరు చేయాలని తుది అంచనాలను తక్షణమే ఆమోదించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాయాలని సీఎంవో నిర్ణయించింది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో వైసీపీ  ఎంపీలు ప్రధాని మోదీని కలిసి ఈ నిధుల కోసం విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు తెలిసింది.

నిజానికి ఈ ప్రాజెక్టు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపుగా రూ.5486 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే ఇవ్వాల్సింది రూ.3000 కోట్లేనని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇందులో రూ.859 కోట్లను రుణం సాయం తీసుకుని విడుదల చేసేందుకు జలశక్తి శాఖకు అనుమతినిచ్చింది.

దీంతో నిధులు త్వరలో వస్తాయని జగన్ ప్రభుత్వం ఎంతో ఆశపెట్టుకుంది.  ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక జలశక్తి అధికారులను కలిసి మిగతా రూ.1150 కోట్లను కూడా త్వరగా విడుదల చేయాలని అభ్యర్థించారు జల వనరుల శాఖ ఉన్నతాధికారులు. అంతలోనే ఆర్థిక శాఖ ఈ నెల ( నవంబర్ ) 8న జలశక్తి శాఖ ఆఫీసుకు మెమోరాండం పంపిన విషయాన్ని బయటకు తెలిసింది. కేంద్ర బడ్జెట్ లో ఈ ప్రాజెక్టు ల్కు నిధుల కేటాయింపులు లేవని ఏ విధంగా సహాయం అందించాలనే దానిపై త్వరలో స్పష్టత ఇస్తామని ఆ మెమొరాండం లో ఆర్థిక శాఖ తెలిపింది. సీఎంవో అధికారుల భేటీలో దీని పై విస్తృత చర్చ జరిగింది.