ఓటరుకి ప్రజాస్వామ్యానికి పెళ్ళంట! శుభలేఖ అదిరిందంట!

ఎన్నికల సందర్భంగా ఎవరి ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళది. రాజకీయ నాయకులు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. మధ్యలో ఇంకొంతమంది ఎవరికి తోచినట్టుగా వారు వినోదం పంచుతున్నారు. ఓటింగ్ మీద అవగాహన పెంచడం కోసం కొంతమంది వినోదాత్మక బాటను ఎంచుకున్నారు. ఓటరుకి, ప్రజాస్వామానికి పెళ్ళి చేస్తున్నామంటూ పూణెకి చెందిన కొంతమంది ఒక  వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వెడ్డింగ్ కార్డులో వధూవరుల పేర్ల స్థానంలో ప్రజాస్వామ్యం, ఓటరు అని రాసి వుంది. వివాహ వేదిక స్థానంలో ‘మీ పోలింగ్ కేంద్రం’ అని రాశారు. ‘ఓటు వేయడం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మన దేశాన్ని సుసంపన్నం చేసే దిశగా ముందడుగు వేయాలంటే పార్లమెంటులో మన గళాన్ని ప్రతిధ్వనించే మన ఓటును వినియోగించుకోవడం చాలా ముఖ్యం’ అని ఆ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.