ఇక పెట్రోల్ బంకుల్లో కార్డులు రద్దు....
posted on Jan 8, 2017 2:53PM

ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే ఇప్పుడు మరో షాక్ ఎదురైంది. రేపటినుండి పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను రద్దు చేయనున్నారు. పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. కార్డు ద్వారా జరిపే ప్రతి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వసూలు చేయాలని నిర్ణయించడమే దీనికి కారణం. దీంతో పెట్రోల్ బంకుల యజమానులు మండిపడుతున్నారు. బ్యాంకులు విధించాలనుకున్న ఈ కొత్త చార్జీలు వినియోగదారులపై భారం మోపడం లేదు. దీంతో అదంతా తమపై పడుతుందని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. దీనికి నిరసనగానే సోమవారం నుంచి కార్డులను అంగీకరించడం లేదని, కేవలం నగదునే అంగీకరిస్తామని అఖిల కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియమ్ అధ్యక్షుడు బీఆర్ రవీంద్రనాథ్ స్పష్టంచేశారు.