బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం...
posted on Jan 8, 2017 3:25PM

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ మాట్లాడుతూ..రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకపోయినా.. ఆ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టి ప్రచారం చేస్తామని అన్నారు. తాము పోటీ చేస్తున్న పంజాబ్, గోవా ఎన్నికల ప్రక్రియ ముగియగానే తమ దృష్టి మొత్తం యూపీపైనే కేంద్రీకరిస్తామని, పార్టీ కీలక నేతలు, స్టార్ కాంపెయినర్లు రంగంలోకి దిగి.. బీజేపీని బట్టబయలు చేసేలా ప్రచారం నిర్వహిస్తారని అన్నారు. 'బీజేపీ దేశాన్ని మోసం చేసిందని.. జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద దెయ్యం ఆ పార్టీనే' అని ఆయన పేర్కొన్నారు.