మరోసారి రక్తమోడిన బాగ్దాద్... 11 మంది మృతి

 

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో తరచూ ఆత్మహుతి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన జరిగింది. వివరాల ప్రకారం...  బాగ్దాద్ శివారు సదర్ పట్టణంలోని  మార్కెట్ లో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఉన్న ఒక ఉగ్రవాది మార్కెట్ లోకి చొరబడేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన  సెక్యూరిటీ గార్డు, ఆ కారును ఆపాల్సిందిగా హెచ్చరించాడు. కారు ఆపకపోవడంతో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో కారులో ఉన్న ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడిలో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu