కూలీ కోసం వెళ్తే.. కుక్కల దాడి..


విశాఖపట్నంలో ఓ దారుణమైన ఘటన జరిగింది. కూలీలపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖలోని అక్కయ్యపాలెం లలితానగర్ లో ఓ భవనం నిర్మాణంలో ఉంది. ఈ నేపథ్యంలో పది మంది కూలీలు అక్కడికి వెళ్లారు. అయితే అదే అంతస్తులో ఉన్న పెంపుడు శునకం గొలుసులు తెంచుకుని కూలీలపై దాడి చేయడంతో వారు పరుగులు తీశారు. ఈక్రమంలో ముగ్గురు కూలీలు అక్కడి నుంచి కిందకు దూకేశారు. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.