మచిలీపట్నం నుంచి పేర్ని కుటుంబం అదృశ్యం
posted on Dec 13, 2024 1:55PM
రేషన్ బియ్యం విదేశాలకు తరలిస్తున్న వైసీపీ మాఫియాపై కూటమి ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. రేషన్ బియ్యం వైకాపా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు చెందిన గోడౌన్ లో దాచినట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెపై కేసు నమోదైంది. అప్పట్నుంచి జయసుదతో బాటు పేర్ని నాని కనిపించడం లేదు. వైసీపీ కార్యాలయానికిగానీ, వైసీపీ చేపట్టే ఆందోళనా కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. మచిలీ పట్నం కోర్టులో జయసుధ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమెకు ముందుస్తు బెయిల్ లభించకపోవడంతో జయసుధతో బాటు పేర్ని కుటుంబం అదృశ్యమైంది.
వేబ్రిడ్జి తూకంలో లోపాల వల్లే రేషన్ బియ్యం ఆరోపణలు వస్తున్నాయని జయసుద ఓ వైపు చెబుతూనే మరో వైపు మిస్ అయిన రేషన్ బియ్యం నష్ట పరిహారంతో కట్టి స్తామని జయసుధ ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తే తప్పును ఒప్పుకున్నట్టయ్యింది.