కెటీఆర్ అరెస్ట్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ 

ఫార్ములా ఈ కార్ రేసు కుంభకోణంలో మాజీమంత్రి కెటిఆర్ పై కేసు నమోదు చేయడానికి  తెలంగాణ గవర్నర్  ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.  రేవంత్ సర్కార్ గత నెలలో కెటీఆర్ ను అరెస్ట్ చేయాలని నిర్ణయించి హైద్రాబాద్ లో 144 సెక్షన్ విధించింది. తెలంగాణలో   దీపావళి తర్వాతపొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు చేసిన ప్రకటనతో కెటీఆర్, హరీష్ రావు, కెసీఆర్  అరెస్ట్ పక్కా అని ప్రచారం జరిగింది. ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కెటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు.  కెటీఆర్ ను అరెస్ట్ చేసే ముందు గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణం కేవలం  కల్వకుంట్ల కుటుంబ ప్రయోజనాల కోసం చేసినట్లు కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. కెటీఆర్ కొడు కు హిమాన్షు కోరికమేరకు కెటీఆర్ బావమరిది ఈ ఈవెంట్  చేపట్టినట్టు తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణా సంస్థకు తెలంగాణ సర్కార్ 46 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ ముట్ట జెప్పింది. హెచ్ఎండీఏ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవినీతినిరోధకశాఖ గుర్తించింది. బోర్డు అనుమతి లేకుండానే హెచ్ ఎండీ ఏ దూకుడు ప్రదర్శించింది.  బిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారు.  కెటీఆర్ ఆదేశాల మేరకే తాను చెక్కులను రిలీజ్ చేసినట్టు అరవింద్ కుమార్ పేర్కొన్నారు.  ఒక విదేశీ నిర్వహణ సంస్థకు 46 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం నిబవధనలను ఉల్లంఘించింది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంపై ఇద్దరు అధికారులపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఇంత పెద్ద ఈవెంట్ అయిన ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గానే తీసుకుంది. డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కుంభకోణం వెలికి తీసారు. తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించినట్టు మాజీ మంత్రి కెటీఆర్ చెప్పుకోవడం గమనార్హం. గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ నెలాఖరులో కెటీఆర్ అరెస్ట్ కావడం  తథ్యమని తెలుస్తోంది.