జైలు నుంచి ఇంటికి చేరుకున్న పుష్ప
posted on Dec 14, 2024 9:36AM
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడ్డ రేవతి కేసులో సినీ హీరో ఈ నెల 13న(శుక్రవారం) రిమాండ్ కోసం చెంచల్ గూడ జైలు కోసం తరలించారు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ బెయిల్ పత్రాలు సరైన సమయంలో అందకపోవడంతో అల్లు అర్జున్ రాత్రాంతా జైలులోనే గడపాల్సి వచ్చింది. వైకాపా ఎంపీ, న్యాయవాది నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇప్పించారు. 14 రోజుల రిమాండ్ లో ఉన్న అల్లు అర్జున్ ను శనివారం తెల్లవారు జామున జైలు అధికారులు విడుదల చేయడంతో ఆయన జూబ్లిహిల్స్ నివాసానికి చేరుకున్నారు.జైలు నుంచి నేరుగా రోడ్ నెంబర్ 45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుని తర్వాత నివాసానికి వెళ్లారు అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు పలువురు చేరుకుంటున్నారు.