మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబిత అరెస్ట్ 

వికారా బాద్ జిల్లా తాండూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రులైన సత్యవతి రాథోడ్ , సబితా ఇంద్రారెడ్డిలను అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది. ఎస్టీ హాస్టల్లో  ఫుడ్ పాయిజన్ అయి విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. దీన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న మాజీ మంత్రులు అరెస్టయ్యారు.  ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో బిఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.