తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో..
posted on Jan 9, 2016 11:33AM

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్సై జగన్‌మోహన్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఎస్సై జగన్‌మోహన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. పెద్దపల్లిలోని పోలీస్ క్యార్టర్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొన్న ఎస్సై జగన్‌మోహన్.. తాను చనిపోవడానికి గంట ముందు సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. సూసైడ్ నోట్ లో నా చావుకు ఎవరూ కారణం కాదని.. తన సోదరుడు కిరణ్ ఏసీబీ కేసు క్లియర్ చేయాలని కోరారు. అంతేకాదు తన భార్య జ్యోతిని క్షమించమని.. తన తల్లిని మంచిగా చూసుకోమని కూడా కోరినట్టు తెలుస్తోంది. ఇంకా సుల్తానా బాగ్ సీఐ, ఎస్సైలు నాకు మంచి స్నేహితులు.. సీఐ ప్రశాంత్ పై నేను ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. పెద్దపల్లి ప్రజలు, ఎమ్మెల్యే, ఎస్పీ నన్ను క్షమించాలి.. మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించొద్దని కోరాడు.
కాగా కరీంనగర్ మండలం చర్లభూత్కూర్‌కు చెందిన జగన్‌మోహన్ 2007లో పోలీసుశాఖలో ఎస్సైగా చేరాడు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, నర్సాపూర్(జీ) ఎస్సైగా పని చేసిన తర్వాత కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎస్సైగా జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పనిచేశాడు. 2015 జనవరి 14న పెద్దపల్లి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు పోలీసులు సూసైడ్ నోటు స్వాదీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.