ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీ.. టీడీపీ ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఇటీవలే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను  కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఫెక్సీలు ఏర్పాటుపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఫెక్సీలు ఏర్పాటు చేసింది ఆంధ్రాలో కాబట్టి.  తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల చీకటి జీవితాలలో వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గార్కి మా శతకోటి అభివందనములు" అని ఆ ఫ్లెక్సీపై పేర్కొన్నారు. దీంతో ఏపీలో కేసీఆర్ పేరిట ఫెక్సీలు ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఏపీలో కెసిఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అవమానించడమే అని వారు అంటున్నారు.  ఫ్లెక్సీలను తొలగించాలని వారు పంచాయతీ కార్యదర్శిని కోరారు.