పాక్ క్రికెటర్ వసీం అక్రంపై కాల్పులు
posted on Aug 5, 2015 9:57PM
.jpg)
ప్రముఖ పాక్ క్రికెట్ ఆటగాడు వసీం అక్రంపై ఈరోజు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులుబైక్ వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు. ఆయన వెంటనే తన కారులో నుండి బయటకు దూకి తప్పించుకొనే ప్రయత్నం చేయగా, దుండగులలో రెండవ వ్యక్తి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కానీ ఆయన తన కారు వెనుక దాగి వారి దాడి నుండి సురక్షితంగా తప్పించుకోగలిగారు. తమ ప్రయత్నం విఫలం అవడంతో ఆ దుండగులు ఇద్దరూ తమ బైక్ పై పరారయ్యారు. ఈరోజు వసీం అక్రం కరాచీలో ఉన్న జాతీయ క్రీడా మైదాహానం వద్దకు చేరుకొన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆయన వారి బండి నెంబర్ నోట్ చేసుకొని దానిని పోలీసులకు ఇచ్చి పిర్యాదు చేసారు. ఇంతకు ముందు ఎన్నడూ తనకు ఎవరి నుండి బెదిరింపు ఉత్తరాలు, కాల్స్ లేదా మెసేజ్ లు రాలేదని తెలిపారు. కనుక తనపై ఎవరు ఎందుకు దాడి చేసారో తనకు తెలియదని ఆయన మీడియాకు తెలిపారు.