సంక్షోభంలో పాడి పరిశ్రమ
posted on Mar 14, 2012 4:22PM
రాష్ట్రంలో పాడి పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. పశుగ్రాసం కొరతతోపాటు దాణా ధరలు విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలో పాడి పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లో చాలామంది రైతులు పశువులను మేపలేక వాటిద్వారా వచ్చే అరకొర ఆదాయంతో జీవనం సాగించలేక వాటిని అమ్ముకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత రెండేళ్ళుగా వర్షపాతం సగటుకన్నా తక్కువ నమోదు అయింది. దీనివల్ల పంటల దిగుబడి తగ్గి ఎండుగడ్డి నిల్వలు హరించుకుపోయాయి. పశువుల దాణాతో పశువులను పెంచుదామనుకుంటే వాటి ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. వాటికి తగినంత గడ్డిగాని, పశుదాణాగాని ఇవ్వకపోవడంతో పాల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో రోజుకు 10 లీటర్ల పాలు ఇచ్చే పశువులు ఇప్పుడు సగటున 5 లీటర్లు కూడా ఇవ్వడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో పాడి పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.