విజయవాడ లో రేపు నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం

కరోనా పెరిగిపోతున్న తరుణం లోలాక్ డౌన్ నిబంధనలు కఠినం  ఏపీ ప్రభుత్వం మరింత కఠిన తరం చేసింది. ఒక్క విజయవాడలోనే 120కి పైగా కేసులు నమోదు తో ప్రభుత్వం అప్రమత్తం అయింది. కరోనా వ్యాపించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను మూసివేయాలని ఆదేశించింది. నాన్ వెజ్ షాపుల్లో కొరవడుతున్న సామాజిక దూరాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆదివారం రోజున విజయవాడలో నాన్ వెజ్ షాపులు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.