గిరిజన మరణాలకు కారణం వారి జీవన శైలి!
posted on Nov 28, 2022 9:30AM
ఐ సి ఎం అర్ సర్వే వెల్లడి...
గిరిజన ప్రాంతాలలో మరణాలకు కారణం జీవన శైలే కారణమని నిర్ధారించారు .ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశం లోని 12 గిరిజన ప్రాంతాలలో అంటువ్యాధులు కాని వ్యాదులవల్ల నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ వల్లే 66 % మరణాలు సంభవించినట్లు ఐ సి ఎం ఆర్ సర్వే వెల్లడించింది.అంటువ్యాధులు కాని వ్యాధులు తరువాత ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు 15% గాయాల వల్ల11 %మరణాలు సంభవించినట్లు ఇఐ సి ఎం ఆర్ సర్వే వెల్లడించింది.
5౦౦౦ వ్యాధి గ్రస్తుల కుటుంబాల లో 7౦ % గిరిజనులు ఇంటివద్దే చనిపోవడం అధికారులు గమనించారు. దీనికి గల కారణాలు ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన లేకవడం ముఖ్యంగా అత్యవసర సమయం లో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం దేశం లోని గిరిజన ప్రాంతాలలో నేటికి వైద్య సేవలు లేవని కనీస సౌకర్యాలు మందులు వైద్యులు అత్యవర సమయం లో ఎవరు అందుబాటులో లేకపోవడం రవాణా రోడ్డు వ్యవస్థకు కూడాఅందు బాటులో లేవని ఐ సి ఎం ఆర్ సర్వ్ లో వెల్లడించింది.ఐ సి ఎం ఆర్ సర్వ్ వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 5,29 2 వ్యాధి గ్రస్తుల కుటుంబాలతో మాట్లాడి నట్లు తెలిపారు.గిరిజనుల లోని సమీప కుటుంబాలు 7౦ %మంది ఇంటివద్దే చనిపోయారని 9% మంది చికిత్చ పొందుతూ మరణించారని జిల్లా ఆసుపత్రులలో 5% ప్రయివేట్ ఆసుపత్రిలో ౩%ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు స్థానిక ఆరోగ్య కేంద్రాలలో గ్రామీణ అసుపత్రులలో 2%వైద్య కళాశాలలు క్యాన్సర్ ఆసుపత్రులలో 1౦ % ఇతర గిరిజనులు ఎక్కడ మరణించారో గుర్తులేదని తేల్చారు.
ఇతరులు ఆరోగ్యసదుపాయాలు లేక మరణించినవారు మరో ౩% ఉన్నట్లు సర్వేలో వెల్లడించారు.దాదాపు 1/4 వంతు వ్యాధి గ్రస్తులు అసలు ఎలాంటి చికిత్చా లేకుండా అనారోగ్యంతో ఉన్నందున చనిపోయినట్లు ఐ సి ఎం ఆర్ నివేదికలో పేర్కొంది.ఇతరులకు ముందుగానే జిల్లా ఆసుపత్రులలో2 %ప్రైవేటు ఆసుపత్రులలో 2౦ %పి హెచ్ సి, సి హెచ్ సి లు గ్రామీణ ప్రాంత్ఘాల ఆసుపత్రులలో 19%వైద్య కళా శాలలు క్యాన్సర్ ఆసుపత్రులో 9 %స్థానిక డాక్టర్లు గిరిజన వైద్యులు 1౩ % చికిత్చలు నిర్వహించారు.ఐ సి ఎం ఆర్ సర్వేలో 29%గిరిజనులలో వ్యాధి గ్రస్తులలో హై బి పి చరిత్ర ఉందని ఈ కారణంగా కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధులు దీర్ఘ కాలిక శ్వాస సంబంధిత వ్యాధులు ఆస్తమాతో 11 %గుండె పోటుతో 12 %గుండె జబ్బులతో 11 %క్యాన్సర్ తో1౦ %డయాబెటిస్ 9% మంది మరణించారని సర్వేలో పేర్కొన్నారు అయితే ఒక అపోహ ఏమిటి అంటే గిరిజన ప్రజలు ఇతరులకన్న నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ బారిన పడ్డారని నులు కాని వారు సైతం జీవన శాలి వల్ల వచ్చే వ్యాధులు చాలామంది ఇంటి వద్దే చనిపోయారని అంశం పై స్పష్టత నిచ్చిన్నట్లయ్యింది.
పరిశోదన వివరాలు అందించిన వివరాల ప్రకారం ఆయా గిరిజన ప్రాంతాలలో ఆసుపత్రులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్లు లేకపోవడం ఆరోగ్యం పై అవగాహన లేకపోవడం వంటి అంశాలు ఐ సి ఎం ఆర్ దృష్టికి వచ్చిందని డాక్టర్ ప్రాశాంత్ మాతుర్ తెలిపారు.వాస్తావం చెప్పాలంటే గిరిజన ప్రాంతాలు పట్టణీకరణ జీవన శైలి లో మార్పులు ఆహార అలవాట్లు గిరిజన జిల్లాలలో మరల మరల ఉడికించిన నిల్వ ఉంచిన ఆహారం లేదా రీఫైండ్ చేసిన ఆహారం తీసుకోవడం అన్నిటికీ మించి గిరిజనులలో పొగాకు ఉత్పత్తుల ఎక్కువగా వాడడం వల్లే క్యాన్సర్ రోగులు అధికంగా ఉన్నారని ఐ సి ఎం ఆర్ డైరెక్టర్ డాక్టర్ మాధుర్ అన్నారు. ఐ సి ఎం ఆర్ నేషనల్ సెంటర్ ఫర్ దుసీజేస్ ఇంఫోర్మేటిక్స్ ఈ సమచ్గారం ఉంది.