ఏపీ చీఫ్ సెక్రటరీగా నీలం సహానీ... తొలి మహిళా సీఎస్ గా రికార్డు...

 

నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నీలం సహానీ రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారిణి అయిన నీలం సహానీ... ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన నీలం సహానీని... ఏపీ కేడర్‌కు రిలీవ్ చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, ఎంపర్ మెంట్ కార్యదర్శిగా పనిచేసిన నీలం సహానీ.... ఇప్పుడు ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టి ....నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా రికార్డు సృష్టించారు.

1984వ ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన నీలం సహానీ... మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. అలాగే, టెక్కలి సబ్ కలెక్టర్ గాను, నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్ గాను పనిచేశారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా, హైదరాబాద్ లో స్ట్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా, అలాగే నిజామాబాద్ జిల్లా పీడీడీ ఆర్డీఏగా, ఖమ్మం జిల్లాలో కాడా అడ్మినిస్ట్రేటర్ గాను పనిచేశారు. అనంతరం ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా కలక్టర్ గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ గా, ఆర్ అండ్ బి కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా క్రీడలశాఖ కమిషనర్ మరియు శాప్ వీసీ అండ్ ఎండీగా పనిచేశారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఏపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్త్రీ-శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం మరియు ఎంపర్ మెంట్ కార్యదర్శిగా పనిచేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ కి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సతీనాయర్, మిన్నీ మాధ్యూలు మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేయగా... నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ బాధ్యతలు చేపట్టారు.