పెళ్లి తర్వాత నయన సినిమాలకు దూరం ప్రభుదేవ
posted on Sep 9, 2011 5:11PM
చెన్
నై: అందాలతార నయనతార తోనే తన పెళ్లి జరుగుతుందని నృత్య దర్శకుడు ప్రభుదేవా తెలిపారు. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు తమని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు. తన పెళ్లి విషయాన్ని రాద్ధాంతం చేయకండని ఆయన విలేకరులను వేడుకున్నారు. అది పూర్తిగా తన వ్యక్తిగతం అన్నారు. తమ పెళ్లి గురించి అతిగా మాట్లాడుతున్నారు. రాస్తున్నారని ఆయన బాధపడ్డారు. నయనతారతో పెళ్లి పలానా రోజంటూ ఇంటర్నెట్, పేపర్లలో ఇచ్చిన సమాచారం సరైందికాదన్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే ఈ పెళ్లి జరుగుతోందన్నారు. శ్రీరామరాజ్యం సినిమాలోలాంటి పాత్రలు లభిస్తే పెళ్లి జరిగేవరకు నయనతార నటిస్తుందన్నారు. పెళ్లయిన తర్వాత నయన తార సినిమాల్లో నటించబోదని చెప్పుకొచ్చారు.