రోశయ్యకు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఏసీబీ కోర్టు మండిపాటు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు ప్రస్తుత గవర్నర్ కె. రోశయ్యను అమీర్‌పేట భూముల కేసు వదిలేట్లు లేదు. రోశయ్యకు హైదరాబాదులోని అమీర్‌పేట భూ కుంభకోణం కేసులో క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై కోర్టు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోశయ్యకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై న్యాయవాది శ్రీరంగారావు మళ్లీ కోర్టుకెక్కారు. దానిపై విచారణ జరిపిన ఎసిబి రోశయ్య గవర్నర్ పదవి చేపట్టే ముందు కొన్ని రోజుల వ్యవధిలో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. భూముల వ్యవహారంతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఏ ఆధారాలతో రోశయ్యకు క్లీన్‌చిట్ ఇచ్చారని ఎసిబి కోర్టు ప్రశ్నించింది. అందుకు సంబంధించిన పత్రాలను ప్రతివాదులకు కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. తక్కువ ధరకు అత్యంత విలువైన భూములను తమ సన్నిహితులకు కట్టబెట్టారని శ్రీరంగారావు రోశయ్యపై, మరో 14 మందిపై ఎసిబి కోర్టుకు ఫిర్యాదు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu