సెక్స్ గురించి మీకు తెలిసిందేంటి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది ఇదే!
posted on Aug 27, 2024 9:30AM
భారతదేశంలో సెక్స్ అనే పదం ఎక్కడైనా పబ్లిక్ గా వినిపిస్తే చాలా పెద్ద చర్చలు, మరెంతో పెద్ద వార్తలుగా మారతాయి. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఈ శారీరక సంబంధం గురించి అందరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పబ్లిగ్గా చర్చలు పెట్టడం వల్ల మార్పులు సాధ్యమవుతాయంటే ఇప్పటికి భారతదేశంలో ఎన్నో విషయాలు మార్పు చెంది ఉండాలి. వీటిలో లింగ సమానత్వం, అక్షరాస్యత, కనీస మానవహక్కులు మొదలైనవి తప్పనిసరిగా ఉండాల్సినవే. కాబట్టి మార్పు అనేది ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడటం వల్లే రాదు.. చరిత్ర ఏమి చెప్పింది?? వాస్తవంలో ఏమి జరుగుతోంది?? వీటిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే కాలానికి తగ్గట్టుగా జరగాల్సిన మార్పులు ఏమిటి అనేది తెలుస్తుంది.
ప్రతి సంవత్సరం జూన్ 9 వ తేదీని జాతీయ సెక్స్ డే లేదా లైంగిక సంబంధాల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి మనిషికి జీవితంలో తిండి, నిద్ర, నీరు వంటి కనీస అవసరాలు ఎలాగో అలాగే.. సెక్స్ కూడా ఒక కనీస అవసరం. వయసు వల్ల ఏర్పడే శారీరక స్పందనల నుండి శరీరాన్ని సహజస్థితిలోకి తీసుకురావడానికి సెక్స్ ఉపయోగపడుతుంది.
నిజానికి సెక్స్ అనే పదం విదేశీయులది అయినా దీన్ని కూడా కళాత్మకంగా చూపెట్టిన ఘనత భారతీయులకే దక్కింది. శృంగారం, సంభోగం పేర్లతో ఈ శారీరక అవసరం ఎన్నో వేల ఏళ్ల నుండి వ్యక్తుల మధ్య ఒక జీవనదిలా సాగుతోంది. పండితులు తృతీయ పురుషార్థంగా కామంను వర్ణించారు. ముఖ్యంగా వాత్సాయనుడు రచించిన కామసూత్రం, కొక్కోకుడు రచించిన కొక్కోక శాస్త్రం మొదలైనవి వేల ఏళ్ల క్రితం నుండే ఉన్నాయి. కామసూత్రలో 64 విధాలుగా శృంగారాన్ని ఆ కాలానికే వర్ణించారంటే ఈ విషయం గురించి దేశ దేశాలు భారతదేశం నుండే ఎన్నో నేర్చుకున్నాయని చెప్పవచ్చు. ఇవి అప్పట్లో రాజకుటుంబీకులు, పండితులకు మాత్రమే లభ్యమైనా క్రమంగా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఇకపోతే సెక్స్ అనేది ఆరోగ్యకరమైన సంబంధంగా కొనసాగితే అది ఎంతో గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఒత్తిడి, శరీరం ఫిట్ గా ఉండటం దీని ద్వారా సాధ్యమవుతుంది. కేవలం పునరుత్పత్తికి ఇదొక మార్గమనే కోణంలో దీన్ని ఎప్పుడూ భావించకూడదు. ఇవి అర్థం చేసుకుంటే సెక్స్ అనేది ఎప్పుడూ బూతుగా కనిపించదు, అనిపించదు.
◆నిశ్శబ్ద