హస్తసాముద్రికం నిజంగానే నిజమా? ఏ చెయ్యి ఉన్నవారికి ఎలాంటి యోగం ఉంటుందంటే...

ప్రతి వ్యక్తి జీవితం వేరుగా ఉన్నట్టే మనిషి అరచేతి ఆకారం, దాని పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది. అరచేతి రేఖలు, గుర్తులను చూసి వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుందో, అదే విధంగా అరచేతి ఆకారాన్ని చూసి మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎంత అదృష్టవంతుడో, జీవితంలో ఎంత పురోగతి సాధిస్తాడో తెలుసుకోవాలంటే అతని అరచేతి ఆకృతి చూడాలంటారు. నిజానికి ఇవన్నీ కట్టుకథలుఅని కొట్టిపారేసేవారున్నా హస్తసాముద్రిక శాస్త్రం ఎంతో పేరు ప్రఖ్యాతులు కలది. ఒక వ్యక్తి  అరచేతి  ఆకృతి, దాని పొడవు  వెడల్పును చూడటం ద్వారా వ్యక్తి  గురించి చాలా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇంతకీ విభిన్నమైన అరచేతులు ఎలా గుర్తించాలి? ఎలాంటి చెయ్యి కలిగిన వారికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది? ఇవన్నీ జ్యోతిష్యం చెప్పేవారే ద్వారానే కాదు సాధారణంగా కూడా తెలుసుకోచ్చు. ఎలాగంటే..

అరచేయి చిన్నగా ఉంటే..

అరచేతులు చిన్నగా ఉన్న వ్యక్తులు  చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వీరికి చాలా  స్వచ్ఛమైన హృదయం ఉంటుంది. చిన్న అరచేతులు ఉన్నవారిలో దేవుడి పట్ల భక్తి, విశ్వాసం అధికంగా ఉంటాయి.  దైవారాధనను వీరు బాగా ఇష్టపడతారు. చిన్న అరచేతులు ఉన్న వ్యక్తులు జీవితంలోని అన్ని ఆనందాలను సంపాదించగలుగుతారు.  ఈ వ్యక్తులు వారి వ్యక్తిత్వాన్ని వారు చాలా ఇష్టపడతారు.  కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు.

అరచేయి పెద్దగా ఉంటే..

పెద్ద అరచేతులు ఉన్న వ్యక్తులు తెలివిగా,  గంభీరంగా ఉంటారు. ఇలాంటి వారు తమ పనిని బాధ్యతగా చేస్తారు. వీరు తమ  జీవితంలో  కష్టపడి మంచి విజయాలు సాధిస్తారు.  సామాజిక,  మతపరమైన కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు.

మృదువైన అరచేతులు ఉంటే..

అరచేతులు మృదువుగా, మందంగా  ఉన్న వ్యక్తులు నిజంగా అదృష్టవంతులే అని చెప్పవచ్చు.  అలాంటి వారిని అదృష్టలక్ష్మి వెంబడిస్తూనే ఉంటుంది.  వీరు జీవితంలో  చాలా  ఆనందాన్ని పొందుతారు. జీవితంలో సంతోషాన్ని వెతుక్కోవడానికి కష్టపడరు.

అరచేతులు గట్టిగా ఉంటే..

గట్టి అరచేతి ఉన్నవారు జీవితంలో ఆనందం కోసం చాలా  కష్టపడాల్సి ఉంటుంది. సంతోషం కోసం, సుఖవంతమైన జీవితం కోసం వీరు బాగా   కష్టపడతారు. అలాగే పని పట్ల ఇతర విషయాల్లో నిజాయితీగా ఉంటారు. ఈ వ్యక్తులు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు.

                                                                              *నిశ్శబ్ద.

Related Segment News