సినీనటిపై దాడి

 

తమిళనాడులో ఒక సినీ నటిమీద దాడి జరిగింది. తమిళనాడులోని తేని జిల్లా, దేవదానపట్టి దక్షిణ వీధికి చెందిన మూక్కన్ కుమార్తె మురుగేశ్వరి (38) పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించింది. ఇటీవల విడుదలైన హిట్ సినిమా ‘ఈమె నాన్ కడవుల్’ సినిమాలో కూడా ప్రాధాన్యం వున్న పాత్రను ధరించింది. మురుగేశ్వరి శనివారం నాడు బస్టాప్‌లో దిగి ఇంటికి నడిచి వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన చిన్నపాండి (17), తంగపాండి (17) ఆమెను అటకాయించి దాడి చేశారు. తరువాత ఆమె ధరించిన వస్త్రాలను చింపారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన మురుగేశ్వరి కేకలు వేసింది. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులూ పరారయ్యారు. మురుగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవదానపట్టి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu