ప్రధాని మోడీని కలవనున్న జగన్

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన యంపీలతో కలిసి ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని, ఆ తరువాత కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ తదితరులను కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు విడుదల మొదలయిన అంశాల గురించి వినతి పత్రం అందించబోతున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలనన్నిటినీ అమలుచేయవలసిందిగా కోరనున్నారు. మోడీని కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి  పిర్యాదు చేయబోతున్నారు.