నేడు తిరుపతిలో మునికోటి అంత్యక్రియలు

 

తిరుపతిలో మునికోటి అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్త మునికోటి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆయనను చెన్నైలోని ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. కాగా ఈ రోజు సాయంత్రం తిరుపతిలో మునికోటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మునుకోటి మృతదేహాన్ని తీసుకురావడానికిగాను చెన్నై వెళ్లారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.

 

మరోవైపు మునికోటి మృతి నిమిత్తం బంద్ కు పిలువునిచ్చారు. ఈ బంద్ లో కాంగ్రెస్ పార్టీలు.. వామపక్షాలు పాల్గొన్నాయి. సినిమా థియేటర్లు, వాణిజ్య వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిండంతో తిరుపతిలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. అయితే దేవుని దర్శార్ధం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని.. వారి ప్రయాణించే బస్సులను రాకపోకలను అడ్డుకోవద్దని పార్టీ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని.. ఇలాంటి పరిస్థితిల్లో ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని.. ఉద్యమం ద్వారనే ప్రత్యేక హోదాను సాధించాలని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు ఇస్తామని.. దీనిపై చర్చించి ఈ రోజు సాయంత్రం లోపు అధికారికంగా ప్రకటిస్తామని సీపీఐ నేతలు తెలిపారు.